సండే వచ్చిందంటే చాలు.. ఈ రోజు స్పెషల్ ఏంటి అనే మాట అందరిలో వినిపిస్తుంది. ఎందుకంటే ఆరోజు (ఆదివారం) హాలిడే .. కాని గతంలో అంటే స్వాతంత్ర్యం రాకముందు అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు . ప్రతి నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఆదివారం సెలవు ఎప్పటి నుంచి ప్రారంభమైంది.. సండేకు హాలిడే కు గల సంబంధం ఏమిటి.. ఈస్టోరీలో తెలుసుకుందాం..!
ప్రస్తుతం మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు .
అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. కాని అమావాస్య రోజు చేతి వృత్తి వారు.. కూరగాయల షాపులకు కొత్త సరుకు రాదు. అందుకే -అమావాస్యకో.. పున్నమికో అంటుంటాము కదా. విద్యార్థులకు మాత్రం గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య రోజులు .. అవిద్య దినాలని.. విద్య నేర్పే వారని ప్రాచీగ గ్రంథాల ద్వారా తెలుస్తుంది
వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే చదువుగాని, కొత్త పనులు ప్రారంభం గాని ససేమిరా ఉండేవి కావు. చింతన మంటే జరిగిన పాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు సూర్య ఉపాసన చేసేవారు.
మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. భారతీయుల నుంచే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్య్రం సూర్య లోకం స గచ్ఛతి" అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . కాని నేడు ఆదివారం ప్రాముఖ్యతను విస్మరించి. సండే మందు.. ముక్క అంటూ..పూర్వీకుల ఆచారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాం.
మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. కాని ఇప్పటికైనా ఆదివారం శక్తిని.. కాబట్టి ఇప్పటికన్నా ఆదివారం నాటి శక్తిని మనం గుర్తించాలి. చేతనైన నియమాలు పాటించాలి, మన భవిష్యత్ తరముల కొరకు - మన పిల్లలు అందరూ పాటించేలా చేయాలి ...
