రష్మిక తన భర్త విజయ్ దేవరకొండకు చెప్పిన బర్త్ డే విషెష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేమతో నిండిన పలు ఫొటోలను పంచుకుంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. విజయ్‌తో కలిసి గడిపిన క్యూట్ మూమెంట్స్‌తో పాటు, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన కొన్ని ప్రత్యేక ఫొటోలను కూడా ఆమె అభిమానులతో షేర్ చేసింది. అయితే, ఈ మొత్తం రోజును రష్మిక సరదాగా “రివర్స్ ఆర్డర్”లో వివరిస్తూ పోస్ట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫొటోలలో జిమ్ సెల్ఫీలు, కారులో ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలు, ఇరు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన బెస్ట్ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా తమ జీవితంలోని అందమైన క్షణాలను “నేషనల్ క్రష్” రష్మిక అభిమానులతో పంచుకోవడంతో, ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
“ఈ రోజు మై మ్యాన్ బర్త్ డే.. నా రోజంతా ఇలా గడిచిపోయింది.. అయితే రివర్స్‌లో చెబుతున్నా,” అంటూ రష్మిక తన పోస్ట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత రోజు ఎలా సాగిందో సరదాగా వివరించింది.
“ఇప్పుడు మేము మా ఫ్రెండ్ ఇంటికి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అంతకుముందు జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేశాం. దాని ముందు నేను క్విక్ కార్డియో చేశాను, విజయ్ ఒక మీటింగ్‌కి వెళ్లాడు. దాని ముందు విజయ్‌ని ప్రేమగా కలవడానికి ఇంటికి వచ్చిన మా బాయ్స్ అండ్ గర్ల్స్‌ని కలిశాం. వాళ్ల నుంచి నాకు కూడా చాలా ప్రేమ దక్కింది. శిమ్ము విజయ్ బర్త్‌డే కోసం ఇక్కడికి వచ్చింది. ఇలా మొత్తం రోజు పర్ఫెక్ట్‌గా గడిచింది,” అని రష్మిక రాసుకొచ్చింది.
అలాగే తన షూటింగ్ ఒకటి క్యాన్సిల్ కావడంతో, విజయ్‌తో పూర్తి రోజు గడపగలిగానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. చివరగా, “హ్యాపీయెస్ట్ బర్త్‌డే టు యూ మై విజ్జు!” అంటూ విజయ్‌కు ప్రేమగా శుభాకాంక్షలు తెలిపింది.
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన', రాహుల్తో రణబాలి, హాయ్ నాన్న డైరెక్టర్తో ఓ మూవీ చేస్తున్నారు. తాజాగా రణబాలి మేకర్స్ విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియోలో విజయ్ తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో చూపించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ శిక్షణ, వారియర్ పాత్ర కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రష్మిక ప్రస్తుతం మైసా, కాక్ టెయిల్, విజయ్ తో రణబాలి మూవీస్ చేస్తుంది.
