తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ ఏపీ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధాని మోడీ. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ మోడీకి స్వాగతం పలికారు. గంటకు పైగా చంద్రబాబు నివాసంలో ఉన్నారు మోడీ. వివిధ అంశాలపై సీఎం చంద్రబాబుతో సమాలోచనలు జరిపారు మోడీ.
In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.@ncbn pic.twitter.com/YyFqO9Hry7
— Narendra Modi (@narendramodi) May 10, 2026
అనంతరం ఎక్స్ వేదికగా చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లిన ఫోటోలను షేర్ చేశారు మోడీ. చంద్రబాబు నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబసభ్యులను కలిశానని..వారందరిని కలవడం విభిన్న అంశాలపై అభిప్రాయాల్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు మోడీ.
►ALSO READ | పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. చలించిపోయిన ఏపీ డిప్యూటీ సీఎం !
అంతే కాకుండా పవన్ యోగక్షేమాల గురించి తెలుసుకున్నానని...పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
