V6 News

Akhanda 2 Collections: అఫీషియల్.. ‘అఖండ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..

Akhanda 2 Collections: అఫీషియల్.. ‘అఖండ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’(Akhanda2 Thaandavam). ఈ మూవీకి బాలయ్య ఫ్యాన్స్ నుంచి అఖండమైన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా తొలిరోజు (డిసెంబర్ 12న) వసూళ్లను ప్రకటిస్తూ మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.‘అఖండ 2: తాండవం’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిపారు. అయితే, గురువారం రాత్రి (డిసెంబర్ 11న) ప్రీమియర్ షోలు + ఫస్ట్ డే వసూళ్లు కలుపుకుని రూ.59.5 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు వెల్లడించారు.

‘‘దైవ గర్జన బలంగా స్పష్టంగా వినిపిస్తోంది. అఖండ2 ఫస్ట్ డే +ప్రీమియర్‌లతో రూ. 59.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, గాడ్ అఫ్ మాసెస్ బాలకృష్ణకు అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది’’ అని పేర్కొన్నారు. ఇకపోతే, బాలయ్య లాస్ట్ మూవీ డాకు మహారాజ్ తొలిరోజు రూ.56 కోట్ల గ్రాస్ సాధించింది. ఇపుడు ఈ లెక్కను సరిచేస్తూ రూ.59కోట్లు రాబట్టి హయ్యెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది.

ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ అప్‌డేట్ ప్రకారం, అఖండ 2 ఇండియాలో రూ.22.53 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా రూ.21.95 కోట్లు వసూళ్ళు చేయగా, హిందీలో రూ.11 లక్షలు, తమిళంలో రూ.43 లక్షలు, కర్ణాటకలో రూ.3 లక్షలు, మలయాళంలో ఒక లక్ష రూపాయలు వసూళ్లు చేసింది. డిసెంబర్ 11న వేసిన ప్రీమియర్స్ ద్వారా రూ.8 కోట్లు వచ్చాయని సినీ వర్గాలు వెల్లడించాయి.

►ALSO READ | Nabha Natesh: భళే ఉంది ఈ సుందరవల్లి సోయగం.. నభా నటేష్ భారీ హిస్టారికల్‌ ఫిల్మ్స్

ఇలా ప్రీమియర్+తొలిరోజు వసూళ్లు కలుపుకుని అఖండ 2 మొత్తం ఇండియా వైడ్గా రూ.30 కోట్లు దక్కించుకుంది. 2021లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన అఖండ 1, ఇండియాలో 21కోట్ల నెట్ సాధించింది. ఇపుడు భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 మాత్రం ఇండియాలో 22కోట్లు మాత్రమే సాధించడం గమనార్హం!!

అఖండ 2 కథగా.. 

2021లో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్‌గా తీసిన ఈ తాండవం.. అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో మొదలవుతుంది. చైనా మిలిటరీ భారత్‌‌పై దాడి చేసి సమగ్రతను దెబ్బ తీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్‌ (కబీర్‌ దుల్షన్‌ సింగ్‌) ని పావుగా వాడుతాడు. ఈ క్రమంలో హిందూమతంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవమైన మహ కుంభమేళాను టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ పవిత్రమైన గంగానదిలో వైరస్ కలుపుతారు. ఇదే అదనుగా చేసుకుని ప్రతిపక్ష నేత ఠాకూర్‌ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు. అసలు దేవుడు అనేవాడే లేడు అని సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు.

ఇదే క్రమంలో అందుకు విరుగుడుగా DRDOలో శాస్త్ర‌వేత్త‌లు యాంటీ డాట్ వాక్సిన్‌ని క‌నిపెడ‌తారు. ఈ బృందంలో ఒకరైన యువ శాస్త్ర‌వేత్త జ‌న‌ని (హ‌ర్షాలీ మ‌ల్హోత్రా) ఒక్క‌రే వ్యాక్సిన్‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురే ఈ యువ శాస్త్ర‌వేత్త జ‌న‌ని. తాను ఒక్కతి మాత్రమే వాక్సిన్తో బయటపడుతుంది. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్‌ను, జననీని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ చీఫ్ ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో ఆమెని ర‌క్షించేందుకు రుద్ర సికింద‌ర్ అఘోరా (బాల‌కృష్ణ‌) రంగంలోకి దిగుతాడు.

అఖండ అస్థిత్వం ఏమిటి? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు.. ఆపద వస్తే వస్తాడు? అని అఘోరా ఎలా నిరూపించాడు? జ‌న‌ని ఆప‌ద‌లో ఉన్న విష‌యం అఘోరాకి ఎలా తెలిసింది? 17 ఏళ్ల వయసులోనే జననీ యువ సైంటిస్టుగా దేశానికి ఎలాంటి సేవ చేసింది? ప్రతిపక్ష నేత, చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన పోరాటం ఏమిటి? ముఖ్యంగా నేత్ర (ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి (సంయుక్త)ల పాత్ర ఏమిటీ? అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం కథ.