పలు ఇంటరెస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది నభా నటేష్. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘స్వయంభూ’. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్నాడు. గురువారం నభా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌తోపాటు క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌లో తను మహారాణి లుక్‌లో ఇంప్రెస్ చేస్తోంది. ఇక ఇందులో సుందరవల్లిగా నభా నటేష్ కనిపించనుందని తెలియజేశారు. కథలో సుందరవల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానుంది.
►ALSO READ | Vrusshabha: నాన్నగా నువ్వే నా గెలుపు.. ఎమోషనల్ అయ్యేలా మరో ఫాదర్ సాంగ్
Team #Swayambhu wishes its 'Sundara Valli' aka the gorgeous @NabhaNatesh a very Happy Birthday ❤🔥
— Pixel Studios (@PixelStudiosoff) December 11, 2025
She will stun everyone with her charm and performance in Swayambhu ❤️
ICYM the 'Rise of Swayambhu'
▶️ https://t.co/abeqlO2DVo@actor_nikhil @iamsamyuktha_ @NabhaNatesh… pic.twitter.com/opOvd8zwWh
ఈ మూవీతో పాటుగా విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ‘నాగబంధం’ చిత్రంలోనూ నభా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోనూ నభా క్యారెక్టర్ గ్లామర్‌కే పరిమితం కాకుండా కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫొటో షూట్స్ షేర్ చేసి అభిమానులను అలరిస్తుంటుంది.

