హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కేంద్ర హైదర్ సెంట్రల్ వ్యాఖ్యలకు మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. 'ముస్లిం సమాధులు కోసం డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు.. హిందూ దేవాలయాల గురించి మాట్లాడితే తప్పా? అని ఫైర్అయ్యారు. తాను దేవాలయాలపై మాట్లాడినప్పుడు అభివృద్ధి గురించీ కూడా మాట్లాడానని.. కానీ మూర్ఖులు తమకు నచ్చి నదే వింటారంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.'బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయం పునర్నిర్మా ణం తప్పా? హైదరాబాద్లో ఒక్క వర్షం పడితే చాలు ట్విట్టర్ టిల్లు దశాబ్దపు వైఫల్యం ఐయటపడుతుంది! జూబ్లీహిల్స్ అంటే బంగ్లాలు మాత్రమే అనుకున్నాడు.
ఇప్పుడు బస్తీలు మాట్లాడుతున్నాయి, కాబట్టి నటన మొదలైంది! దేవాలయాలు నగర హృదయంలో ఉండాలి. సమాధులు సగర బయట ఉండాలి! మీరు మాత్రం ఈ నగరాన్ని సమాధిగా మార్చాలనుకుం టున్నారు! 'సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి, బంజారా హిల్స్ పెద్దమ్మ ఆలయం తరలింపు, వేములవాడ ఆలయ పశువుల మరణం, భద్రాచలం ఆలయ భూముల ఆక్రమణ, ఈఓపై దాడి, గోరక్షకుడు సోను సింగ్పై దాడి, హనుమాన్ విగ్రహం ధ్వంసం. వీటిపై ఎందుకు మౌనం పాటించారు? మైనారిటీల పై మమకారం కాదా? కేసీఆర్ భక్తితో ఆటలు ఆడి మూల్యం చెల్లించాడు. అమ్మవారు శక్తివంతురాలు నాస్తికులకు తగిన పాఠం చెబుతుంది' అని అన్నారు.
