14 ఏండ్ల తర్వాత బంగ్లా-పాక్ మధ్య విమాన సర్వీసులు

14 ఏండ్ల తర్వాత బంగ్లా-పాక్ మధ్య విమాన సర్వీసులు
  • కరాచీలో ల్యాండైన బంగ్లా ఫ్లైట్​

ఢాకా: బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల మధ్య సుదీర్ఘకాలం తర్వాత విమాన సర్వీసులు తిరిగి మొదలయ్యాయి. దాదాపు14 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్ విమానయాన సంస్థ ‘బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్’ కు చెందిన తొలి ఫ్లైట్ గురువారం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండైంది.

ఈ సందర్భంగా ఆ విమానానికి పాకిస్తాన్ ఎయిర్ పోర్టు అథారిటీ (పీఏఏ) అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ పరిణామం పాక్– బంగ్లా సంబంధాల్లో కొత్త మలుపని పీఏఏ తన ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి.