27న బ్యాంకుల సమ్మె. ఐదు రోజుల పనిదినాలు అమలుచేయాలని డిమాండ్

27న బ్యాంకుల సమ్మె. ఐదు రోజుల పనిదినాలు అమలుచేయాలని డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఫోరం కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్  మాట్లాడారు.

జాతీయ స్థాయిలోని పలు సంస్థల్లో ఇప్పటికే ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉన్నాయని, అదే విధానం బ్యాంకుల్లోనూ అమలు చేయాలని కోరారు.