
స్థానిక ఎన్నికలక్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీతో పాటు సీపీఎం,సీపీఐ లాంటి లెఫ్ట్ పార్టీలు ,ప్రజా స్టూడెంట్ల యూనియన్లు, స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. వ్యాపారులు, విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా స్థంభించింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ముందు బీసీ సంఘాల అందోళకు దిగారు. బీసీ సంఘాల నాయకులు బైఠాయించారు. బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 42%రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వేములవాడ లో బంద్ కొనసాగుతోంది. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ బంద్ లో పాల్గొన్నారు. తెల్లవారుజామున నుంచే డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు...
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలు బస్టాండ్ ముందు అందోళనకు దిగారు. బస్ డిపో ముందు బైఠాయించిన నిరసన తెలిపారు.42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునుండే బంద్ కొనసాగుతోంది. 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడపకవడంతో బస్టాండ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
42% బీసీ రిజర్వేషన్ సాధన కోసం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హుజురాబాద్ బస్ డిపో ఎదుట అన్ని పార్టీలతో కూడిన జేఏసీ నేతల ధర్నాకు దిగారు.
పెద్దపల్లి జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు వ్యాపార వర్తక సంఘాలుబంద్ కు మద్దతు తెలిపాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. గోదావరిఖని బస్సు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు కదలడం లేదు..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు తాళం వేసి డిపో ఎదుట నిరసన తెలుపారు బీసీ సంఘాల నాయకులు. దీంతో డిపో కే పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. హుస్నాబాద్ లో రోడ్లపై టైర్లు వేసి నిప్పంటించి నిరసన తెలుపారు బీసీ సంఘాల నాయకులు . 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ చట్టం చేయాలని గజ్వేల్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.
మహబూబాబాద్ జిల్లాలో 42 బీసీ రిజర్వేషన్ అమలు చేయలంటూ మహబూబాబాద్ ఆర్టిసి డిపోలో బస్సులను అడ్డుకున్నారు వామాపక్ష పార్టీల నేతలు, బీసీసంఘాల నాయకులు.
నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బిసి లకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ అఖిల పక్షం బంద్ కు పిలుపునిచ్చింది. వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బస్సులు డిపోలో నిలిచిపోయాయి.