బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

భద్రాచలం, వెలుగు : బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం భద్రాచలంలోని అంబేద్కర్​ సెంటర్​లో నిరసన ర్యాలీ, రాస్తారోకో జరిగింది. 33 బీసీ ఉపకులాల నాయకులతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో  ప్రజలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ద్వంద్వ విధానాలతో ముందుకు వెళ్తున్నాయని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోయేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

 ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, కార్యదర్శి బండారు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అనుగోజు నర్సింహాచారి, కోశాధికారి కోపనాతి నరసింహారావు, యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు మేకలమల్లుబాబు యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.