అపార్ట్‌మెంట్ కొంటున్నారా? NOC కోసం లక్షలు అడుగుతున్నారా? జాగ్రత్త.. అస్సలు ఒప్పుకోకండి !

అపార్ట్‌మెంట్ కొంటున్నారా? NOC కోసం లక్షలు అడుగుతున్నారా?  జాగ్రత్త.. అస్సలు ఒప్పుకోకండి !

బెంగళూరులో రీసేల్ అపార్ట్‌మెంట్ కొనేవారికి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒక హౌసింగ్ సొసైటీ కొత్త కొనుగోలుదారుడికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇవ్వడానికి ఏకంగా రూ.1 లక్ష డిమాండ్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది.

అసలేం జరిగిందంటే.. ఒక వ్యక్తి  రూ.60 లక్షలకు అపార్ట్‌మెంట్ కొందామని బేరం కుదుర్చుకున్నాడు. హోమ్ లోన్ కోసం బ్యాంకులు సొసైటీ నుంచి NOC అడిగాయి. కానీ, ఆ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ మాత్రం లక్ష రూపాయలు కడితేనే NOC సర్టిఫికేట్ ఇస్తాం.. ఇది మెయింటెనెన్స్ కోసం కాదు, అపార్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ (Capex) కోసం అని చెప్పింది. పైగా ఈ విషయాన్ని మెయిల్ ద్వారా చెప్పడానికి కూడా నిరాకరించింది.

దీని పై న్యాయ నిపుణులు మాట్లాడుతూ ఒక ఫ్లాట్‌కు పాత యజమాని అన్ని బకాయిలు అంటే మెయింటెనెన్స్, కరెంట్ బిల్స్ కట్టిన తర్వాత, NOC ఇవ్వడానికి అదనపు డబ్బులు అడగడం నేరం, పూర్తిగా చట్టవిరుద్ధం కూడా... అపార్ట్‌మెంట్ రూల్ బుక్‌లో మెంబర్షిప్ చార్జెస్ ఎంత ఉండాలో ముందే రాసి ఉంటుంది. అంతకు మించి వేలల్లో, లక్షల్లో వసూలు చేసే అధికారం అసోసియేషన్‌కు లేదు. కేవలం పాత యజమాని బాకీలు ఏమీ లేవని ధృవీకరించడం/సర్టిఫై చేయడమే అసోసియేషన్ పని. అంతేకానీ, ఇల్లు కొనేవారిని డబ్బుల కోసం వేధించకూడదు అని సూచిస్తున్నారు.

NOC లేకుండా లోన్ తీసుకోవచ్చా:
బెంగళూరులో ఇలాంటి ఘటనలు ఈ కాలంలో పెరిగిపోతున్నాయి. కొందరు బ్యాంకులు ఇలాంటి అక్రమ వసూళ్లను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలను అంటే  సొసైటీ గేట్ యాప్ లోని పేమెంట్ స్క్రీన్‌షాట్లు, పాత యజమాని రాసిచ్చిన క్లియరెన్స్ లెటర్, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ రిసిప్టులైన ఉండాలని సూచిస్తున్నాయి.

ఒకవేళ  ఏదైనా సొసైటీ  ఇలా లక్షల్లో డిమాండ్ చేస్తే, మీరు లీగల్ నోటీసు పంపవచ్చు. పాత యజమాని బకాయిలు అన్నీ కట్టేసిన తర్వాత, అసోసియేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపే హక్కు లేదు.