నిమజ్జనాల సమయంలో అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ జితేశ్

నిమజ్జనాల సమయంలో అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​

భద్రాచలం, వెలుగు : గోదావరి తీరంలో నిమజ్జనాల సమయంలో అలర్ట్​గా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అధికారులను ఆదేశించారు.  సబ్​ కలెక్టర్​ మృణాల్​  శ్రేష్ఠతో కలిసి గురువారం సాయంత్రం ఆయన భద్రాచలం గోదావరి వద్ద నిమజ్జనాల ఏర్పాట్లపై సమీక్షించారు. జరిపారు. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, సురక్షితంగా నిమజ్జనాలు జరిగేలా మండపాల నిర్వాహకులు, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

ఘాట్​ వద్ద లాంచీలు, బారికేడింగ్, లైటింగ్​, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్యం, గజ ఈతగాళ్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేసి24 గంటలూ భక్తులకు అందుబాటులో ఆఫీసర్లు ఉండాలని సూచించారు. వీరి వెంట ఈఈ జానీ, తహశిల్దారు వెంకటేశ్వర్లు, ఈవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.