ఎల్కతుర్తి, వెలుగు: బీజేపీ మద్దతున్న అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే ఆ పంచాయతీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చొరవతో రూ.పది లక్షల నజరానా ఇప్పిస్తామని సిద్దిపేట జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డితో కలిసి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు.
బీజేపీ తరఫు అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎర్రగొళ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కుడితాడి చిరంజీవి, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, మూష్కె వెంకటేశ్, ఆడెపు శ్రీవర్ధన్, పల్లెపాటి మధుకర్, చదిరం వెంకటేశ్, మాజీ సర్పంచులు బూర్గుల రామారావు, కుడుతాడి రాజు, సామల సురేశ్‌రెడ్డి, పోలు కోటేశ్వర్ రావు, సంపత్, రంజిత్ కుమార్, శ్రీకాంత్, నాంపల్లి అశోక్, అల్లి కుమార్, పోగుల ప్రశాంత్, మద్దరబోయిన అనిల్, తిరుపతి, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
