ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ స్కామ్ దర్యాప్తు ఏమైంది? : ప్రేమేందర్ రెడ్డి

ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ స్కామ్ దర్యాప్తు ఏమైంది? : ప్రేమేందర్ రెడ్డి
  • బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్) అవినీతిపై విచారణ చేపడతా మని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పు డు ఎందుకు మౌనంగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రైవేటు సంస్థలకు కట్ట బెట్టిందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం దానిపై విచారణ చేయకుండా ప్రజలను మోసం చేస్తోం దన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీ సులో మీడియాతో మాట్లాడారు. 

జాతీయ రహదారులపై టోల్ ఫీజులను తగ్గించి వాహనదారులకు ఏడాదికి దాదాపు రూ.15 వేలు ఆదా అయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని.. కానీ, తెలంగాణలో మాత్రం ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పై అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పై విచారణను ప్రారంభించాలన్నారు.