- పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు
ఖమ్మం, వెలుగు: బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, దేశ సేవకు అంకితమైన ఒక జాతీయ ఉద్యమం అని ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు అన్నారు. ‘బీజేపీ సిద్ధాంతం, సంస్థాగత అంశాలు’ అనే అంశంపై సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ సిద్ధాంతం ‘సేవే పరమో ధర్మః’ అని చెప్పారు. అధికారాని కంటే సేవా భావం ముఖ్యమని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలన్నారు.
బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బీజేపీ ఒక క్రమశిక్షణ గల సంస్థ అన్నారు. ప్రతి బూత్ బలపడితేనే పార్టీ బలపడుతుందని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ విధానాలను, సంకల్పాలను తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా బాద్యులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
