సంజయ్ నాయకత్వంలోనే ఎన్నికలకు.. అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదు

సంజయ్ నాయకత్వంలోనే ఎన్నికలకు.. అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదు

హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ సీనియర్  నేత ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పార్టీ స్టేట్  ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేండ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్రానికి ఏం సాధించారని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని నిలదీశారు.  ‘‘విద్యార్థులకు, యూనివర్సిటీలకు కేటాయిస్తున్న నిధులు తగ్గిపోతున్నాయి.

ఉద్యోగ కల్పన విషయంలో కేటీఆర్  చెబుతున్న దానికి, వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదని ఆయన ఫైరయ్యారు. 2018 ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్  హామీ ఇచ్చారని, మాట తప్పినందుకు మీడియా సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఇంద్రసేనా తగులబెట్టారు.