
- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నవీపేట్, వెలుగు : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ని ఆర్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ, ఆరు గ్యారెంటీ లతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, కష్టపడ్డ వారికి పదవులు వరిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఒర్వలేకే బీజేపీ, బీఆర్ఎస్లు అసత్యపు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
యువతకు అవకాశం కల్పించాలి
బోధన్,వెలుగు : కాంగ్రెస్ గ్రామ, వార్డు కమిటీలలో యువతకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం బోధన్ పట్ణణంలోని మహాలక్ష్మి కల్యాణమండపంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వద్దని, స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను ఎలా విస్మరించిందో ప్రజలకు తెలుపాలన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. తక్కువ ధరకు ఇసుకను అందించడానికి తాము ఇసుక క్వారీలు ప్రారంభిస్తే కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బోధన్ పట్టణంలోని05, 35, 37, 38 వార్డుల్లో డ్రైనేజీలు , కల్వర్డులు, లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కష్టపడే వారికే పదవులు..ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
2017 కంటే ముందు నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికే పదవులు కేటాయిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. వారం రోజుల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. నవీపేట, బోధన్ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజారెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ నగేశ్‌రెడ్డి, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పాషామోయినొద్దీన్ పాల్గొన్నారు.