డ్రగ్స్ కేసులో మరో నటుడి అరెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటుడి అరెస్ట్

ముంబయి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఇప్పటికే అరెస్టయిన టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్ ఇచ్చిన సమాచారం మేరకు అర్మాన్ కోహ్లి ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొంత మొత్తంలో డ్రగ్స్ పట్టుపడడంతో అర్మాన్ కోహ్లిని కూడా అరెస్టు చేశారు. 
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు డ్రగ్స్ కారణమన్న ఆరోపణల నేపధ్యంలో ఎన్సీబీ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించి పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించడం అప్పట్లో సంచలనం రేపింది. అటు తర్వాత పెద్దగా పురోగతి లేదనుకుంటున్న తరుణంలో ఒక్కరోజులోనే కాదు.. కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు నటుల ఇళ్లలో సోదాలు జరిపి డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. అర్మాన్ కోహ్లిని అరెస్టు చేసిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని అప్పటికప్పుడే అరెస్టు చేయడం సంచలనం రేపింది. మరికొందరు తారలకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.