శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆదివారం జెడ్డా, కొచ్చి నుంచి వస్తున్న రెండు ఇండిగో విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్టు ఎయిర్ పోర్ట్ అధికారులకు ఆగంతకుడు మెయిల్ పంపాడు. విమానాలు ల్యాండ్అయ్యాక ప్రయాణికులను దింపి, భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఫ్లైట్లలో బాంబులు లేవని నిర్ధారించుకొని, అది ఫేక్మెయిల్అని తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
