వెల్‌‌కమ్ టు లోకల్ పబ్

వెల్‌‌కమ్ టు లోకల్ పబ్

‘బిగ్‌‌బాస్’ షోతో గుర్తింపు తెచ్చుకుని, వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు సయ్యద్ సోహెల్. తను నటిస్తున్న చిత్రాల్లో ‘బూట్‌‌కట్ బాలరాజు’ ఒకటి. శ్రీ కోణేటి దర్శకత్వంలో ఎం.డి.పాషా నిర్మిస్తున్నారు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘తాగుదాం తాగి ఊగుదాం’ అనే పాటను రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పాడు. 

 భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన పాటకి అఫ్రోజ్ అలీ క్యాచీ లిరిక్స్ రాశాడు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ కలిసి మాస్ ఎనర్జీతో పాడారు. ‘వెల్‌‌కమ్ టు లోకల్ పబ్.. అవైల్‌‌బుల్ అన్ని స్టఫ్.. కల్లు టేబుల్ మీద పెట్టు.. స్పెషల్ మెనూ ఇప్పుడు స్టార్టు’ అంటూ సాగిన పాటలో సోహెల్, సునీల్ కలిసి చేసిన  మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు దర్శకనిర్మాతలు.