బోరబండలో ట్రాఫిక్ చిక్కులు ఉండవ్ ..మంత్రి వివేక్ వెంకట స్వామి

బోరబండలో ట్రాఫిక్ చిక్కులు ఉండవ్ ..మంత్రి వివేక్ వెంకట స్వామి
  • రోడ్డు విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుంది

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ డివిజన్​లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నుంచి రూ. 12 కోట్లు మంజూరు చేయించే బాధ్యత తనదని మంత్రి గడ్డం వివేక్​వెంకట స్వామి హామీ ఇచ్చారు. ఆదివారం బోరబండలో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన బూత్​ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.

 బోరబండ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి అత్యధిక మెజార్టీ  ఇచ్చే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. బోరబండలో ఉన్న ప్రతి బూత్​ నుంచి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బోరబండలోని రోడ్డు విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఇకపై బోరబండలో ట్రాఫిక్​చిక్కులు ఉండవన్నారు.