భారతదేశంలో సగటున ప్రతి 55 నిముషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు. వీళ్లలో ఎక్కువమంది ఒత్తిడి, ఆందోళన వల్లే చనిపోతున్నారని సైకాలజిస్టులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ భారతదేశంలో జీవన నైపుణ్యాల గురించి ఒక సర్వే చేశాయి. ఆ సర్వే చూసిన నిపుణులు విద్యార్థులు సూసైడ్ లెటర్ రాసి మరీ ఆత్మహత్యలు చేసుకోవడం. ఆశ్చర్యంగా ఉంది. పదో తరగతి లోపు విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు..ఈ పరిస్థితుల నుంచి పిల్లల్ని బయటపడేయాలంటే వాళ్లకు చిన్నప్పటి నుంచే లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అంటున్నారు.
బుర్ర బంద్ పెట్టు. బట్టీ బాగా పట్టు. స్కూల్లో చేరిన దగ్గర్నించీ ఇదే ఈక్వేషన్ తో నడుస్తున్నాయి చదువులు. అసలు చదువంటే ఏంటి? చదువుతో పాటు బుర్ర పెరగాలి. అంతేగానీ మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో కాదు కదా! ఈ విషయం తెలియదా అంటే... అందరికీ తెలుసు... కానీ చదువనే రేస్‌లో మేం ముందున్నామంటే ... మేమున్నామనే పోటీలో పిల్లల్ని దేనికి దూరం చేస్తున్నారో అర్థం చేసుకోవడం లేదు. కావాల్సింది బతుకునిచ్చే చదువులే కానీ బట్టీ పట్టే చదువులు కాదు.
17 ఏళ్ల సచిన్ ఆత్మహత్యకు ప్రయత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఈ పని ఎందుకు చేశావని అడిగితే... 'మార్కులు తక్కువ వస్తే కాలేజీలో చిన్న చూపు చూస్తున్నారు. దాంతో నేనెందుకూ పనికిరానా... అదే ఫీలింగ్ కలిగిందని చెప్పాడు.
ఇది ఈ అబ్బాయి ఒక్కడే సమస్యే కాదు. ఎక్కువమంది పిల్లలు ఇంచుమించు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బందిపడుతున్నారు. వాళ్లకు ఏదో చేయాలని ఉంటుంది. కానీ తల్లితండ్రులు ర్యాంకుల వేట, కాలేజీల ఒత్తిళ్ల మధ్య నలిగిపో తున్నారు. ముక్కున పట్టి చదివేస్తే పోతుందని నాలుగు పాఠాలు బట్టిపెట్టి పరీక్షలు రాస్తున్నారే తప్ప సబ్జెక్టును అర్ధంచేసుకునే ప్రయత్నం చేయడంలేదు. అలా చదవడం వల్ల జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకునే మానసిక స్థైర్యం ఉండకుండా పోతోంది.
రోజుకు ఎన్ని గంటలు చదువుతున్నారు? చదివేదంతా వాళ్ల మెదడులోకి ఎక్కుతుందా? లేదా? పాఠాన్ని అర్ధం చేసుకుని చదుపుతున్నారా... ఇలాంటి వాటితో సంబందం లేదు. మొదటి ర్యాంకు వచ్చిందా లేదా అంతే. కాలేజీలు రోజులో ఎన్ని గంటలు చదవాలి? ఏ టైంలో ని సబ్జెక్టు చదవాలి? టార్గెట్ లు ఇచ్చి విద్యార్థుల పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి అత్యాధునిక విద్యావిధానాన్ని ప్రశ్నించే కథే.. మహాభార తం... అరణ్యపర్వంణలోని అష్టావక్రుని చరిత్ర. జ్ఞానవంతులు కావడానికి వయసుతో సంబంధం లేదని కూడా ఈ కథ తెలియజేస్తుంది.
అష్టావక్రుని కథ
మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఆయా స్థలాల గొప్పతనం, చరిత్రల గురించి తెలుసుకుంటూ ఉంటారు. రోమశుడనే ముని పండ్లతో నిండిన తోటను చూపించి ఇవి శ్వేతకేతు ఆశ్రమమని.. అష్టావక్రుడు, శ్వేతకేతులు ఇద్దరూ మేనల్లుడు..మేనమామలని అంటాడు. ధర్మరాజు అష్టావక్రుని గురించి చెప్పమని అడుగుతాడు. అందుకు రోమశుడు అష్టావక్రుని కథను వివరంగా చెప్పాడు.
అతిగా చదవడం అనర్దమే!
ఏకపాదుడు గొప్ప విద్యాంసుడు. సుజాత అనే యువతిని వివాహం చేసుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఏకపాదుడు తన ఆశ్రమంలో శిష్యులచేత ఎప్పుడూ వేదాలు చదివిస్తూ, వాళ్లకు విశ్రాంతి ఇచ్చేవాడు కాదు. సుజాత గర్భంలో ఉన్న శిశువు తండ్రి చేస్తున్న వేదాధ్యయన పద్ధతి సరైనది కాదని గ్రహిస్తాడు. తీరిక లేకుండా శిష్యుల చేత చదివించడం వల్ల కలిగే నష్టాల గురించి తండ్రికి చెప్తాడు. "వాళ్లచేత పగలనక, రాత్రనక ఎడతెరిపి లేకుండా చదివించడం చేత మందబుద్ధులుగా తయారవుతారు. నిద్రలేక పోవడం వల్ల వేదపాఠాలను తప్పుగా చదువుతున్నారు. ఈ విధంగా చదివించడం ఎందుకు?" అని ప్రశ్నిస్తాడు.
అందుకు ఏకపాదుడు భార్య గర్భంలో ఉన్న కొడుకు పై కోపంతో "నీవు విద్యావిధానాన్ని వక్రంగా విమర్శించావు. కాబట్టి అష్టావక్రుడివై పుడతావని శపిస్తాడు. తండ్రి శాపం వల్ల కొడుకు ఎనిమిది వంకర్లతో పుడతాడు. అయితే అప్పటికి ఏకపాదుడు జనక మహారాజు సభకు వెళ్లి, అక్కడ వరుణుడి కొడుకైన నందితో వాదించి ఓడిపోతాడు. సగం నీటిలో మునిగి శక్త అనుభవిస్తూ ఉంటాడు.
చదువంటే...ఇలా!
బట్టి చదువుల వల్ల పూర్తి అవగాహన రాదు. కేవలం చదివే విషయం మాత్రమే నోటికి వస్తుంది. అంశాన్ని అర్థం చేసుకుని చదవడం పట్ల మాత్రమే సంపూర్ణ జ్ఞానం వస్తుంది. అష్టావక్రుడు అలా చదవడం వల్లే గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. తండ్రి కంటే ఎక్కువ తెలివితేటలు వచ్చాయి. తండ్రిపై గెలిచిన వాళ్లను సైతం ఓడించాడు. లోతైన అధ్యయనం, అవగాహన లేకుండా పైపై చదువులు దండగని అష్టాదక్షుని చరిత్ర తెలియజేస్తుంది.
అలాగే చదువుకు, జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు చిన్నవాళ్లెనా కొందరికి అపారమైన ప్రతిభ ఉంటుంది. అలాంటి వాళ్లను గౌరవించాలి మరికొందరికి వయను పెరిగినా వ్యక్తిత్వం పెరగదు. విలువలతో జీవించరు. చెప్పే మాటలను చదివిన విషయాలను జీవితానికి అన్వయించుకోరు. అలాంటప్పుడు ఎంత జ్ఞానం ఉన్న దండగే. గర్వం పనికిరాదు. అది చదువును, వ్యక్తిత్యాన్ని కుందింపజేస్తుంది. మనిషికి వయసుకన్నా ప్రతిభ ముఖ్యం.. వయసులో చిన్నవాళ్లకు జ్ఞానం, మంచి ప్రవర్తన ఉంటే వాళ్లను తప్పక గౌరవించాలి. గొప్పవాళ్లుగా గుర్తించాలి.
వయసు... ప్రతిభ
అష్టావక్రుడు మేనమామ శ్వేతకేతుతో కలిసి ఉద్దాలకుడనే ముని దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. తన తండ్రి జనకమహారాజు దగ్గర బందీగా ఉన్నాడని తెలుసుకుని, విడిపించడానికి శ్వేతకేతుతో కలిసి వెళ్తాడు.. వయసులో చిన్నవాడివి, ఆశ్రమంలో యాగం జరుగుతోంది. వయసులో పెద్దవాళ్లకు, అనుభవంతో యజ్ఞం చేయించగల వాళ్లకి మాత్రమే అనుమతి. మీకు లేదని అక్కడి వాళ్లు ఆష్టావక్రుడు, శ్వేతకేతులను ఆపుతారు. అందుకు అష్టావక్రుడు చాలా సంవత్సరాలు ఓర్పుతో బతకడం, వెంట్రుకలు తెల్లబడటం ముసలితనానికి గుర్తులా..? జ్ఞాసం ఉన్న బాలుడైనా ఈ భూమి మీద వృద్ధుడే.!.
చదువుకోవటం, ఆ చదువునునిత్యజీవితంలో ప్రతిఫలించేటట్లు సడుచుకోవటం వల్లే జ్ఞానం వస్తుంది. అలా నడుచుకునే వాళ్లు వయసులో చిన్నవాళ్లైనా.. ప్రజలందరి చేతా మన్నించదగిన వాళ్లు .. కాబట్టి మమ్మల్ని చిన్నవాళ్లని అవమానించవద్దు. జనకమహారాజు సభలో గర్వంతో విర్రవీగేవాళ్లను ఓడించడానికి వచ్చామని చెప్తాడు. లోపలికి వెళ్లి సభ జనకమహారాజు అడిగిన చిక్కు. ప్రశ్నలన్నింటికి అష్టావక్రుడు సమాధానాలు చెప్తాడు. వరుణుడి కొడుకైన పందితో అనేక విషయాల గురించి వాదించి, చర్చించి గెలుస్తాడు. చివరకు అతడి దగ్గర ఓడిపోయిన వారందరితోపాటు, తండ్రిని కూడా విడిపిస్తాడు. జనకమహారాజు చేత సన్మానం పొండుతాడు.
-వెలుగు,లైఫ్-
