బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును సక్సెస్ చేయాలి..పార్టీని మరింత బలోపేతంచేయాలి

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును సక్సెస్ చేయాలి..పార్టీని  మరింత బలోపేతంచేయాలి
  •     బీఆర్ఎస్​ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

కోదాడ, వెలుగు: బీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలని బీఆర్ఎస్​ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సక్సెస్​ చేయాలన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, అన్నివర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానించాలని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లెక్కల కోసం కాకుండా, ప్రతి కార్యకర్త తమ పరిధిలోని గ్రామం, వార్డు, బూత్‌‌లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. 

రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్​ కృషి చేసిందని గుర్తు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కోరారు. సభ్యత్వ నమోదు ఇన్​చార్జి తిప్పని విజయసింహా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు నయీం, నాయకులు పైడిమర్రి సత్యబాబు, కందిబండ సత్యనారాయణ, సుంకర అజయ్ కుమార్  పాల్గొన్నారు.