కాంగ్రెస్ ​ఆత్మరక్షణలో పడ్డది: వేముల ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్ ​ఆత్మరక్షణలో పడ్డది: వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుపై అసలు బాగోతాన్ని బయట పెట్టగానే కాంగ్రెస్ ఆత్మ రక్షణలో పడి.. తమపై పసలేని ఆరోపణలకు దిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.

నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది కాంగ్రెస్ నేతల తీరు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకాలు బయటపెట్టగానే కాంగ్రెస్​ పరిస్థి తి తేలు కుట్టిన దొంగలా మారింది. రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం.. ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను విమర్శించిన కాంగ్రెస్ నేతలకు ట్రిపుల్ ఆర్ మీద కనీస అవగాహన లేదు.

అలైన్మెంట్ మార్పుపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమా ధానం చెప్పకుండా అజ్ఞానంతో మాట్లాడారు. ఊకదంపుడు ఉపన్యాసాలకు, బెదిరింపులకు భయపడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేయకుంటే త్రిపుల్​ ఆర్​ అలైన్మెంట్ మార్పుపై స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్​చేస్తున్నా" అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.