ఆసిఫాబాద్ జిల్లాలో స్టూడెంట్ల కోసం బాలల చిత్రాల ప్రదర్శన : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్ జిల్లాలో స్టూడెంట్ల కోసం బాలల చిత్రాల ప్రదర్శన : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • డిసెంబర్ 31 వరకు రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు..
  • కలెక్టర్ వెంకటేశ్  ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో బాలల కోసం సినిమా థియేటర్లలో పిల్లల చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ప్రెస్​నోట్​లో తెలిపారు. విద్యార్థుల కోసం జిల్లాలోని సినిమా థియేటర్లలో డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక చిత్రాలు ప్రదర్శిస్తామన్నారు. 

విద్యార్థికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.25, పట్టణ ప్రాంతాల్లో రూ.30 టికెట్ ధర నిర్ణయించామని, థియేటర్ల పరిధిలోని అన్ని స్కూళ్ల యాజమాన్యాలు తమ విద్యార్థులు ఈ సినిమాల తిలకించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల యాజమాన్యాలకు ముందస్తు సమాచారం అందిస్తామన్నారు. విద్యార్థులు బాలల చిత్రాలను తిలకించేందుకు పోలీస్, విద్య, రెవెన్యూ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు.