మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం ఐటీఐ ఆవరణలోని మోడల్ కెరీర్ సెంటర్ లో ఈ నెల 21న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎ.రవికృష్ణ ఓ ప్రెస్నోట్లో తెలిపారు. హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో 40 ఫార్మసిస్ట్, 20 ట్రైనీ ఫార్మసిస్ట్, 30 అసిస్టెంట్ ఫార్మసిస్ట్, 10 రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులు ఉన్నాయన్నారు. ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్ పోస్టులకు ఫార్మసీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు వారు అర్హులన్నారు.
మిగతా పోస్టులకు టెన్త్ క్లాస్ విద్యారత ఉండాలని తెలిపారు. అలాగే మంచిర్యాలలోని బర్త్ రూట్స్ హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, నర్సింగ్ ఇన్చార్జ్, నర్స్, ఫార్మసిస్ట్, అకౌంటెంట్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ మొత్తం 15 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 8247656356, 8333059029, 9110368501 నంబర్లలో సంప్రదించాలన్నారు.
