
- స్పీకర్‌కు అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ తో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు భేటీ అయ్యి నోటీసు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు సంబంధించి కోమటి రెడ్డి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని స్పీకర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎస్ నిధులు రాలేదని, నల్గొండ నియోజకవర్గ రోడ్లకు నిధులివ్వలేదని, ఉప్పల్ఎలివేటెడ్కారిడార్కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని కోమటి రెడ్డి ఇచ్చిన సమాధానం అబద్ధమని వివరించారు. వెంటనే మంత్రిపై తమ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.