వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్ పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం మంచి లాభాల్లో ఉన్నాయని.... భవిష్యత్తులో మన దేశ ఎదుగుదలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
రూ.10వేల కోట్ల పెట్టుబడి.
రాబోయే ఐదు సంవత్సరాలలో బయోఫార్మా రంగంలో రూ. 10,000 కోట్ల పెట్టుబడిని సీతారామన్ ప్రతిపాదించారు, ఈ పెట్టుబడి దేశ ఔషధ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జీవుల కణాల ద్వారా తయారు చేసే మందుల ఉత్పత్తిని భారత్‌లో పెంచడం దీని లక్ష్యం.
ఫోన్లు, కంప్యూటర్లలో వాడే చిప్స్ అంటే సెమీకండక్టర్లు అలాగే వాటి తయారీకి కావాల్సిన పరికరాలను మన దేశంలోనే తయారు చేసేలా సెమీకండక్టర్ మిషన్ 2.0ని మరింత వేగవంతం చేయనున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కింద డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లోని ఒక ప్రత్యేకమైన, స్వయంప్రతిపత్తి వ్యాపార విభాగం.
ALSO READ : బడ్జెట్ 2026 తర్వాత ఏఏ వస్తువులపై దిగుమతి సుంకం సున్నా అయ్యిందో తెలుసా..?
ఖనిజ సంపన్న రాష్ట్రాలైన ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఖనిజాల వెలికితీత, శుద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. 'సబ్కా సాథ్, సబ్‌కా వికాస్' అనేది ప్రభుత్వ మూడవ కర్తవ్యని అని ఆమె తెలిపారు.
రూ.20,000 కోట్లతో కొత్త పథకం
ఉక్కు, సిమెంట్ సహా అన్ని రంగాలలో కంపెనీల నుండి వెలువడే కార్బన్ ను అరికట్టడానికి రూ. 20,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించారు. నీటి మీద ల్యాండ్ అయ్యే విమానాల (Seaplanes) తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తారు. నగరాల మధ్య ప్రయాణ వేగాన్ని పెంచడానికి 7 కొత్త హై-స్పీడ్ రోడ్ మార్గాలను నిర్మిస్తారు. వారణాసి, పాట్నా ప్రాంతాల్లో నీటి రవాణాను మెరుగుపరచడంతో పాటు, ఓడల రిపేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
