Layoffs: అప్పటికప్పుడు తీసేస్తే.. ఎలా బతకాలి : కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ ఎంప్లాయ్

Layoffs: అప్పటికప్పుడు తీసేస్తే.. ఎలా బతకాలి : కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ ఎంప్లాయ్

ఆర్థిక మాంధ్యం భయంతో ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. ఇటీవలే ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ కూడా కొంత మంది స్టాఫ్ ను తీసేసింది. ఈ క్రమంలోనే బైజూస్ లో ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎడ్‌టెక్ కంపెనీ తనను రాజీనామా చేయమని బలవంతం చేస్తోందని కన్నీళ్లతో కూడిన వీడియోను పంచుకుంది. లేని పక్షంలో, ఆగస్టు 1 తర్వాత తనకు జీతం నిలిపివేస్తామని బెదిరించారని, ప్రస్తుతానికి, ఆమె లేఆఫ్‌ బారిన పడ్డట్టు ఓ సూచన చేసినట్టు తెలిపింది.

ఆకాన్షా ఖేమ్కాగా అనే మహిళా ఉద్యోగి బైజూస్ లో అకడమిక్ స్పెషలిస్ట్ గా పనిచేస్తోంది. తనను తీసేస్తారన్న వార్త బయటికి రావడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిని పోషించేది తానేనని, బైజూస్ తనకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేయకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని హెచ్చరించింది. ఈ సందర్భంగా లింక్డ్‌ఇన్‌లో ఓ వీడియోను పంచుకున్న ఆకాన్షా.. తనకు ప్రభుత్వం నుంచి మద్దతు కావాలని కోరింది. “దయచేసి నాకు సహాయం చేయండి. ఈ కఠిన పరిస్థితిలో నాకు న్యాయం చేయండి. దయచేసి నాకు సహాయం చేయండి. ఈ పోస్ట్ తర్వాత మార్గం లేకపోతే, నేను నా జీవితాన్ని ముగించాలి. నేను ఉద్యోగం కోల్పేతే నాకు ఆగస్టు 1న నా జీతం లభించదు కాబట్టి నాకు మరో అవకాశం లేదు” అని ఆమె పోస్టులో రాసుకువచ్చింది.

"జూలై 28లోగా నేను కంపెనీ నుంచి వైదొలగాలని లేదా ఆగస్టు 1న నా జీతం పొందలేనని ఒక సమావేశంలో నాకు సడెన్ గా చెప్పారు. వారికి మరో 30-35 రోజులు నేను అవసరం. కానీ కుటుంబంలో నేనొక్కదాన్నే సంపాదిస్తున్నాను. నా భర్త అనారోగ్యంతో ఉన్నాడు, నాకు అప్పులు ఉన్నాయి. నా జీతం ఇవ్వకపోతే నేను ఎలా బ్రతకాలి?" అని ఆమె ఈ వీడియోలో చెప్పింది. "బైజూస్ వేరియబుల్ పే కూడా వాగ్దానం చేశాను. దాని ప్రకారం నేను నా కుటుంబం కోసం రుణాలు తీసుకున్నాను. కానీ కంపెనీ ఎప్పుడూ వాటిని చెల్లించలేదు. ఇప్పుడు అప్పుల వాళ్లు నా వెంట పడతారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎలా తినాలి?" అని ఆమె కన్నీరు కారుస్తూ చెప్పింది.

ఈ వీడియో అప్‌లోడ్ చేయడంలో వెంటనే వైరల్‌గా మారింది. దీంతో ఆకాంక్షకు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సపోర్టు తెలుపుతున్నారు. “హాయ్ ఆకాన్షా! మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీకు ఉద్యోగం వెతకడంలో లేదా పాలసీని తెలుసుకోవడంలో లేదా ఏదైనా సహాయం కావాలంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. త్వరలో అంతా సర్దుకుపోతుంది” అని లింక్డ్‌ఇన్ యూజర్ ధైర్యం చెప్పగా.. "దేవుడు మిమ్మల్ని కొంత మంచి మలుపుతో ఆశీర్వదిస్తాడు" అని ఇంకొకరు తెలిపారు.