ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు క్యాబినేట్ ఆమోదం

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు క్యాబినేట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ABDM స్కీమ్ ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్లకుగాను 1,600 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ  అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని ప్రకటించింది కేంద్రం. డిజిటల్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదు LIC లో 20 శాతం పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఈ వేలం విండో ద్వారా బొగ్గు కంపెనీలు బొగ్గు  అందించడానికి మంత్రి వర్గం ఆమోదించింది.

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా విద్యార్థులు

వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్