రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఓ తుఫాన్ కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో్యారు. 2023, నవంబర్ 25వ తేదీ శనివారం ఉదయం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గేట్ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తుఫాన్ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు మరణించడంతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.