- పెళ్లి తర్వాత ఇంటికి వస్తూ జేసీబీని ఢీకొన్న కారు
- ఇద్దరికి గాయాలు
చేవెళ్ల, వెలుగు: నూతన వధూవరులు వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన కౌకుంట్ల వెంకటేశ్ కూతురు వివాహం మంగళవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగింది. పెండ్లి ముగించుకుని కారులో పెళ్లికూతురు, పెళ్లికొడుకు, డ్రైవర్ప్రవీణ్, గ్రామానికి చెందిన ఎల్లమ్మ కలిసి రావులపల్లికి బయల్దేరారు. దేవుని ఎర్రవల్లి సమీపంలో రిపేరైన బొలెరో కారును జేసీబీతో తొలగిస్తున్నారు. కారు నేరుగా వెళ్లి జేసీబీని ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వీరిని చేవెళ్లలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
