
గుండెపోటు లేదా హార్ట్ ఎటాక్ ఎక్కడైనా, ఎప్పుడైనా రావొచ్చు, మీకు ఈ లక్షణాలు ఉంటె కొన్ని పరిస్థితుల్లో మీరు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిమిత్రి యారనోవ్ ప్రకారం, మీ బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రతి ఏడాది బాత్రూమ్ లోనే మూర్ఛపోవడం లేదా చనిపోతున్నారని డాక్టర్ యారనోవ్ హెచ్చరించారు. మలబద్ధకం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుందని, దీనిని మీ బాత్రూంలో దాగి ఉన్న నిశ్శబ్దమైన ప్రమాదం అని అన్నారు.
మలబద్ధకం ఉన్నప్పుడు మలవిసర్జనకు మీరు ఎక్కువ ఒత్తిడి పెడితే అది మీ గుండెకు ప్రమాదకరమని డాక్టర్ యారనోవ్ అంటున్నారు. ఇలా ఒత్తిడి పెట్టడం వల్ల వల్సాల్వా మ్యాన్యువర్ అనే ప్రక్రియ ప్రేరేపించబడుతుంది. ఈ ప్రక్రియలో శ్వాసను బిగబట్టి, బలవంతంగా గాలిని బయటికి వదులుతాము. సాధారణంగా చెవిలో లేదా సైనస్‌లలో ఒత్తిడిని తగ్గించడానికి (ఉదాహరణకు, విమానంలో ప్రయాణించేటప్పుడు లేదా స్కూబా డైవింగ్ చేసేటప్పుడు), లేదా కొన్ని రకాల గుండె జబ్బులను (సుప్రావెంట్రిక్యులర్ టాచీకార్డియా) నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే, మలవిసర్జన సమయంలో ఈ విధంగా ఒత్తిడి పెట్టడం వల్ల ఛాతీలో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్త సరఫరా తగ్గి బిపి పడిపోతుంది. చివరికి మెదడుకు వెళ్ళే ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది.
మలవిసర్జన సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఎవరికీ అంటే :
*ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికీ
*హార్ట్ బీట్ సరిగా లేనివారికీ
*ఎక్కువ మోతాదులో బిపి మందులు వాడుతున్నవీరికి
ALSO READ : ట్రంప్ నిర్ణయం భూమరాంగ్ అవుతుందా..
మలబద్ధకం అనేది మలవిసర్జన కష్టంగా జరిగేది. సాధారణంగా మన ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల లేదా మీ దినచర్యలో మార్పుల వల్ల వస్తుంది. ఒకవేళ మీకు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు మలబద్ధకం ఉంటే లేదా మలంలో రక్తం కనిపిస్తే లేదా తీవ్రమైన నొప్పి ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
మలబద్ధకం సమస్యగా ఉంటుంది కాబట్టి, అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ వంటి వాటిని ఎక్కువగా తినాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా నీరు, ఇతర ద్రవాలు తాగడం చాలా ముఖ్యం. శారీరక శ్రమ, రోజూ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం చురుగ్గా ఉంటుంది.