ట్రంప్ నిర్ణయం భూమరాంగ్ అవుతుందా.. యూఎస్ కు నష్టం.. ఇండియాకు లాభం అంట.. ఎలాగంటే..

ట్రంప్ నిర్ణయం భూమరాంగ్ అవుతుందా.. యూఎస్ కు నష్టం.. ఇండియాకు లాభం అంట.. ఎలాగంటే..

H-1B వీసాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇండియాకు నష్టం అని చాలా మంది వాపోతున్నారు. లక్షల మంది యువత ఉపాధిపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ నిర్ణయం భూమరాంగ్ అయ్యేలా ఉందని.. ఇండియా, చైనాలను టార్గెట్ చేస్తూ విసిరిన బాణం.. అమెరికాకే గాయం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అదెలాగో చూద్దాం. 

ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. అమెరికా ఉద్యోగాలను ఇండియన్స్ కొల్లగొడుతున్నారని అక్కసు కక్కుతూ వస్తున్న ట్రంప్.. ఇండియా, చైనా తదితర దేశాలపై దెబ్బకొట్టాలని ఎన్నో కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. అందులో భాగంగానే వీసా రూల్స్ మార్పు.. టారిఫ్స్, సాంక్షన్స్ మొదలైన వివాదాస్పద నిర్ణయాలు. అయితే లేటెస్ట్ గా అమెరికాలోకి వలసలు ఆపాలని భావించి  H-1B వీసాలపై వార్షిక ఫీజును లక్ష డార్లకు పెంచేశాడు. అంటే 88 లక్షల రూపాయలు. ఈ నిర్ణయం తాత్కాలికంగా ఇండియాకు నష్టం చేసినా.. లాంగ్ టైమ్ లో భారత్ కు ప్లస్ అవుతుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కంత్ అంటున్నారు. 

ట్రంప్ నిర్ణయం అమెరికాకే నష్టం కలిగిస్తుందని.. వివిధ దేశాల కొత్త కొత్త ట్యాలెంట్ కారణంగానే అమెరికా అంతగా ఎదిగిందని.. దీన్ని ఆపేస్తే ఆదేశంలో ఇన్నోవేషన్స్ తగ్గిపోయి దివాలా తీస్తుందని అన్నారు. ఇతర దేశాలను టార్గెట్ చేస్తూ వదిలిన బాణం.. యూఎస్ కే గుచ్చుకోనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇండియాకు లాభం ఎలా..?

ట్రంప్ అక్కసుతో తీసుకున్న నిర్ణయమైనా.. అది ఇండియాకు మేలే జరుగుతుందని అమితాబ్ కంత్ అన్నారు. ఇండియాలో కొత్త కొత్త టెక్ కంపెనీలు తయారవుతాయని.. అమెరికా కంపెనీలు కూడా ఇండియాకే పరుగు తీస్తాయని అన్నారు. అంతే కాకుండా లోకల్ గా డెవలప్ అయిన టెక్నాలజీ.. బెంగళూర్, హైదరాబాద్ పుణె, గర్గాన్ తదితర నగరాలలో విస్తరిస్తుందని చెప్పారు. ఇది నెక్స్ట్ వేవ్ ల్యాబ్స్, పేటెంట్స్, ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ ఏర్పాటుకు తోడ్పడుతుందని అన్నారు.