హాలిడేస్, పార్టీస్ టైంలో గుండెపోటు పెంచే ప్రమాదకర అలవాట్లు ఇవే : డాక్టర్ సలహా..

హాలిడేస్, పార్టీస్ టైంలో గుండెపోటు పెంచే ప్రమాదకర అలవాట్లు ఇవే : డాక్టర్  సలహా..

హాలిడేస్  అంటేనే  మనకు నచ్చిన వారితో సంతోషంగా గడపడం, రుచికరమైన భోజనాలు, డ్రింక్స్ లేకుండా అస్సలు పూర్తి కాదు. కాస్త ఆనందించడం మంచిదే అయినా, ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు మీ శరీరం చెప్పే సంకేతాలు వినడం, ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కార్డియాలజిస్ట్ (గుండె డాక్టర్) డిమిత్రి యారనోవ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక విషయం చెప్పారు. హాలిడేస్ సమయంలో ముఖ్యంగా  పండగలప్పుడు గుండె పోటు(heart failure)తో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. నేను ప్రతిరోజూ చాలా మంది గుండెపోతూ వచ్చినవారికి ట్రీట్మెంట్  చేస్తాను. దురదృష్టవశాత్తూ పార్టీల సమయంలోనే గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అని   అన్నారు.

హాలిడేస్ టైంలో మన ప్రతిరోజు అలవాట్ల మార్పులు అంటే ఆహారం, నిద్ర, ప్రయాణాలు, ఒత్తిడి అన్నీ కలిసి ఇబ్బందులు సృష్టించవచ్చని డాక్టర్ హెచ్చరించారు. గుండె జబ్బు ఉన్నవారికి ఇలాంటి చిన్న మార్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ గుండె అప్పటికే కష్టపడుతున్నప్పుడు, మీరు కాస్త ఎక్కువ సంతోషం పొందినా లేదా ఎక్కువగా తిన్నా, అది గుండెపై మరింత ఒత్తిడి పెంచుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది.

డాక్టర్  సలహా ఏంటంటే మీ శరీరంపై కాస్త శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న మార్పులను/ సంకేతాలను వెంటనే గుర్తించండి. గుండె జబ్బు లక్షణాలను పట్టించుకోకుండా వదిలేయకండి లేదా అవి వాటంతట అవే తగ్గుతాయని అనుకోవద్దు. వేచి చూడడం కంటే ముందే చర్య తీసుకుంటే మిమ్మల్ని కాపాడుతుందన్నారు. 

గుండె జబ్బు గురించి గుర్తుంచుకోవాల్సిన  ముఖ్య విషయాలలు:

1.  ఉప్పు (sodium):
పండగ పూట లేదా పార్టీ భోజనాలలో చేసే గ్రేవీ, స్టఫింగ్, ప్యాకెట్ జ్యూస్‌లు, మాంసం & రెస్టారెంట్లలో వండే వంటకాలు ఉప్పుతో నిండి ఉంటాయి. ఉప్పు ఎక్కడ ఎక్కువగా ఉంటే, అక్కడ నీరు కూడా పెరుగుతుంది. ఒక్కసారి ఎక్కువ ఉప్పు తిన్నా కూడా రాత్రికి రాత్రే ఊపిరితిత్తులలో ద్రవం చేరి లేదా గుండె సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది.

2. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది :
ఎక్కువ భోజనం తిన్న తర్వాత ఊపిరి తీసుకోవడంలో వచ్చే మార్పులను గమనించాలని డాక్టర్  సూచించారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. తిన్న తర్వాత మీకు కొత్తగా ఊపిరి ఆడకపోవడం అనిపించినా లేదా నిద్రపోవడానికి ఇబ్బంది అనిపించినా అది శరీరంలో నీరు చేరుతున్నదానికి మొదటి సంకేతం.

3. మద్యం (Alcohol):
గుండె జబ్బు ఉన్న రోగులు మద్యం తాగడం పూర్తిగా మానుకోవాలి, ఎందుకంటే ఆల్కహాల్ రక్తపోటును తగ్గిస్తుంది, గుండె లయను (అరిథ్మియా) మార్చగలదు. మీరు బిపి, గుండె సంబంధిత లేదా మూత్రవిసర్జన కోసం మందులు వాడుతున్నట్లయితే, కొంచెం  ఆల్కహాల్ అయినా కూడా ఇబ్బంది కలిగిస్తుందని హెచ్చరించారు.

4. విపరీతమైన అలసట:
అలసటను తేలికగా తీసుకోకూడదు. ఉత్సాహంగా పనులు చేయడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కోవడం ఇంకా మద్యం సేవించడం వల్ల వచ్చే అసాధారణమైన లేదా అధిక అలసటను వదిలేయకూడదు. 

5.  వేగంగా బరువు పెరగడం:
 ఒక్క రాత్రికే 1-1.5 కిలోల బరువు పెరిగినా లేదా మీ పాదాలు, చేతులు లేదా పొట్టలో కొత్తగా వాపు కనిపించినా అది ప్రమాదానికి సంకేతం. అధిక భోజనం వల్ల మీరు రాత్రికి రాత్రే కిలోల బరువు పెరగరు, అది నీటి నిలుపుదల వల్లనే అవుతుంది గుర్తుంచుకోండి. డాక్టర్ ప్రకారం మందులను జాగ్రత్తగా వాడాలని, మీకు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే డాక్టరుని కలవడానికి ఆలస్యం చేయవద్దని చెప్పారు.