ఎన్‌‌‌‌ఎస్‌‌ఈ కో-లొకేషన్ స్కామ్ లో సీబీఐ సోదాలు

ఎన్‌‌‌‌ఎస్‌‌ఈ కో-లొకేషన్ స్కామ్ లో  సీబీఐ సోదాలు


న్యూఢిల్లీ: ఎన్‌‌ఎస్‌‌ఇ కో-–లొకేషన్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ శనివారం పలు నగరాల్లోని 10కి పైగా చోట్ల సెర్చ్ ఆపరేషన్లను మొదలు పెట్టింది.  ముంబై, గాంధీనగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్  కోల్‌‌కతా వంటి నగరాల్లోని 12  బ్రోకర్ల ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌‌ఎస్‌‌ఈ) మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌‌లపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. 2010– 2015 వరకు ఆమె ఎన్‌‌ఎస్‌‌ఈ చీఫ్​గా పనిచేశారు. ఈ కేసు నిందితులలో ఒకరైన ఒపిజి సెక్యూరిటీస్ ‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌‌’ సెగ్మెంట్​ సెకండరీ పిఓపి సర్వర్‌‌కు కనెక్ట్ అయినట్లు దర్యాప్తులో తేలింది.  రామకృష్ణ, సుబ్రమణియన్‌‌ల హయాంలో ఎన్‌‌ఎస్‌‌ఈ అధికారులు కొందరు బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్​ ఇవ్వడంతో అక్రమంగా లాభాలు పొందారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.  చిత్రా రామకృష్ణ, సుబ్రమణియన్‌‌ను తన సలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ)గా ఏటా రూ. 4.21 కోట్ల జీతంతో పదోన్నతి ఇచ్చారు.