పులుల సంరక్షణకు కేంద్రం పర్మిషన్

పులుల సంరక్షణకు కేంద్రం పర్మిషన్

దేశంలో మరో రెండు కొత్త టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్లులు రానున్నాయి. ఈ రెండు కొత్త ప్రతిపాదనలతో  మధ్య ప్రదేశ్​ రాష్ట్రంలోని శివపురి, రతపానిలో రిజర్వ్​ కేంద్రాలు ఏర్పడనున్నాయి. ఈ రెండింటి ఏర్పాటుతో  మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రంగా అవతరించింది. ఇప్పటికే ఆరు టైగర్ రిజర్వ్ లు,  పది జాతీయ ఉద్యానవనాలు మధ్యప్రదేశ్​లో  విస్తరించి ఉన్నాయి. శివపురిలో మాధవ్ నేషనల్ పార్క్ ను ప్రత్యేక టైగర్ రిజర్వ్ గా ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్రం కేంద్రాన్ని పర్మిషన్​ కోరింది. దీనితో పాటు ఆ రాష్ట్ర సీఎం నుండి క్లియరెన్స్, ప్రజల ఆమోదం తర్వాత రతపాని దగ్గర  మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయనున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మితే రైతులకు బెనిఫిట్