తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు జడ్జిలు
  • సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అడిషనల్ జడ్జిల నియామకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు గతంలో సుప్రీం కోలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా గాడి ప్రవీణ్ కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్ ప్రమాణం చేయనున్నారు. అలాగే, ఏపీ హైకోర్టులో ప్రస్తుతం అదనపు జడ్జిలుగా సేవలందిస్తున్న నలుగురికి శాశ్వత న్యాయమూర్తి హోదా లభించింది.