- ఎంపీ రామ సహాయం ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను ఆధునీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిని మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేయడమే తమ ఆలోచన విధానమని పేర్కొంది. అందులో భాగంగానే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
నిర్వహణ లోపాలు, ముడిసరుకు కొరత, నష్టాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ సంస్థలను ఆధునీకరించేందుకు ఎలాంటి కొత్త పథకాలు లేవని, అందుకే బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిచ్చారు.

