మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ

V6 Velugu Posted on Sep 25, 2021

  • సెప్టెంబర్ 26న 126వ జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన  చిట్యాల (చాకలి) ఐలమ్మ 126 వ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తిని  స్మరించుకున్నారు. అత్యంత వెనకబడిన కులం (ఎంబీసీ) లో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 
సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అని సిఎం కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తి ఇమిడి వున్నదన్నారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా  ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు.
 

Tagged Telangana, TS, CM KCR, TS Govt, kcr comments, , KCR today, ts cmo, chityala Ailamma, Chakali Ailamma, 126th birth anniversary of Ailamma

Latest Videos

Subscribe Now

More News