తెలంగాణలో ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తం

తెలంగాణలో ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తం

హైదరాబాద్‌, వెలుగు: తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పటికీ ఉంటుం దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ‘‘తెలంగాణలో ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తం. రాష్ట్రంలో మేం చేసిన అభివృద్ధి ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. నాడు ఐటీ పరిశ్రమలను నేను ప్రోత్సహించడం తోనే నేడు తెలంగాణ ముందుకు పోతున్నది.

రాష్ట్రంలో పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన ఓటు బ్యాంక్‌ ఉంది. పార్టీ శ్రేణులు కష్టపడితే పార్టీకి పూర్వ వైభవం తేవడం కష్టమేమీ కాదు” అని అన్నారు. చంద్రబాబు 14వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం గా మంగళవారం కాసాని ఆధ్వర్యం లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్​లో ఏర్పాటు చేసిన అభిందన సభలో బాబు మాట్లాడారు.