IPL 2024: చెన్నైలోనే ఐపీఎల్ ఫైనల్.. పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

IPL 2024: చెన్నైలోనే ఐపీఎల్ ఫైనల్.. పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్స్ మ్యాచ్, క్వాలిఫయర్ మ్యాచ్‌ల వేదికలు ఖరారయ్యాయి. ఈ మెగా ఫైనల్ మే 26న చెన్నైలో జరగనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే తాజాగా బీసీసీఐ  పూర్తి షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. 

ఇక దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం లో మార్చి 21న ఒక క్వాలిఫైయర్ 1, మార్చి 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. క్వాలిఫైయర్ 2, మే 24న చెన్నైలో జరగనుంది. 2022, 2023 సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరిగాయి. అయితే ఈ సారి చెన్నై చిదంబరం స్టేడియంకు  మార్చారు. సార్వత్రికల ఎన్నికలు ఉన్నప్పటికీ ఐపీఎల్ అన్ని మ్యాచ్ లు ఇండియాలోనే జరగనున్నాయి. 

Also Read: గ్రౌండ్‌లోకి కుక్క.. హార్దిక్ నినాదాలతో మారుమ్రోగిన స్టేడియం

ఐపీఎల్ లో భాగంగా అన్ని జట్లు ఒక మ్యాచ్ ఆడేశాయి. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు జరిగితే 10 జట్లు లీగ్ లో తమ మొదటి మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాయి. జరిగిన 5 మ్యాచ్ ల్లో సొంతగడ్డపై ఆడిన జట్లే విజయం సాధించాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఈ టోర్నీలో బోణీ కొట్టాయి. నేటి నుంచి అన్ని జట్లు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా నేడు (మార్చి 25) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది.