GT vs MI: గ్రౌండ్‌లోకి కుక్క.. హార్దిక్ నినాదాలతో మారుమ్రోగిన స్టేడియం

GT vs MI: గ్రౌండ్‌లోకి కుక్క.. హార్దిక్ నినాదాలతో మారుమ్రోగిన స్టేడియం

ఐపీఎల్ 2024 కెప్టెన్ గా రోహిత్ ను తప్పించి అతని స్థానంలో పాండ్యను ఎంపిక చేయడం రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు అసలు నచ్చలేదు. యాటిట్యూడ్ కింగ్ గా పేరున్న హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ లో భాగంగా నిన్న (మార్చి 24) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఫ్యాన్స్ హార్దిక్ ను టార్గెట్ చేశారు. టాస్ వేస్తున్న సమయంలో రోహిత్, రోహిత్ అంటూ కేకలు వేశారు.  

Also Read: సొంతగడ్డపై బెంగళూరు మ్యాచ్.. 11 కోట్ల ఆటగాడిపై వేటు

అహ్మదాబాద్ స్టేడియంలోనే ఇలా ఉంటే ఇక ముంబైలో వీరు ఆవేశంతో మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇంతవరకు ఒకే అయినా ఆ తర్వాత అభిమానుల ఆవేశం హద్దుమీరినట్లుగా అనిపించింది. గుజరాత్ ఇన్నింగ్స్ మధ్యలో గ్రౌండ్ లోకి కుక్క రావడంతో హార్దిక్ దానితో ఆదుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆ కుక్క బయపడి హార్దిక్ కు దూరంగా వెళ్ళిపోయింది. ఈ సమయంలో అభిమానులు హార్దిక్.. హార్దిక్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. హార్దిక్ పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం కుక్కతో పోల్చే వరకు వెళ్లడం షాకింగ్ గా అనిపించింది. 

ఇప్పటికే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించారనే బాధలో ఉన్న అభిమానులకు హార్దిక్ పాండ్యా మరింత కోపం తెప్పించే పని చేశాడు. ఫీల్డింగ్ సమయంలో రోహిత్‌ను హార్దిక్ పదే పదే మార్చడం అభిమానులకు కోపం తెప్పించింది. రోహిత్ ను బౌండరీ వద్దకు పంపించడం అభిమానులు తట్టుకోలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సగటు క్రికెట్ అభిమానులను బాధకు గురి చేస్తుంది.  ఆదివారం జరిగిన ఈ  లీగ్‌‌ మ్యాచ్‌‌లో గుజరాత్‌‌ 6 రన్స్‌‌ తేడాతో ముంబైకి షాక్ ఇచ్చింది.