30 రోజుల్లో రూ.3 కోట్లు సంపాదించిన రైతు.. అదృష్టం అంటే ఇలా ఉండాలా..!

30 రోజుల్లో రూ.3 కోట్లు సంపాదించిన రైతు.. అదృష్టం అంటే ఇలా ఉండాలా..!

నమ్మిన  వారిని మోసం చేయనని మరోసారి భూమాత రుజువు చేసింది.  వ్యవసాయం చేయాలంటేనే రైతు భయపడిపోతున్నాడు.  అయినా కొంతమంది భూమాతను నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నాడు.  అలా ఉన్న చిత్తూరు జిల్లా రైతుకు ఒక్కసారిగా అదృష్టం పట్టింది.  తాను పండించిన  నెల రోజుల్లో అమ్మి ఏకంగా 3 కోట్ల రూపాయిలు సంపాదించాడు.


గత కొద్ది రోజులుగా దేశంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు టమోటాలను కొనాలంటేనే భయ పడి పోతున్నారు. అయితే భూమిని నమ్ముకున్న రైతుకి అనూహ్య రీతిలో అదృష్టం వరించింది.. టమోటాల పంట సాగు చేసిన ఓ రైతు మూడు కోట్ల రూపాయలను సంపాదించాడు. వ్యవసాయంపై పెట్టుబడి ఎంతో మంది రైతులు వలసలు వెళ్ళిన ఘటనతో పాటుగా, ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సమయంలో చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు టమోటా పంటపై ఆధారపడి‌ పంటను సాగు చేశారు. సీజన్ మొదట్లో టమోటాకు సరైన గిట్టు బాటు ధర లేక చాలా మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా టమోటాకు అధిక రావడంతో ఒక్క సారిగా టమోటా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇన్నాళ్ళు అప్పులు చేసి‌ బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకును సాగించిన రైతులు జేబులు గలగల మంటున్నాయి.

టమాటా అధికంగా సాగయ్యే చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు భారీగా లాభాలు దక్కాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.3 కోట్ల ఆదాయం వచ్చింది. సోమల మండలం కరకమందకు చెందిన పి.చంద్రమౌళి, ఆయన తమ్ముడు మురళి, తల్లి రాజమ్మ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. వీరికి సొంతూరు కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపువారిపల్లెలో 20 ఎకరాల పొలం ఉంది. ఈ కుటుంబం ఏళ్లుగా టమాటానే సాగు చేస్తోంది.వేసవి అనంతరం వచ్చే పంటకు మంచి ధర వస్తుందని గుర్తించిన ఆ కుటుంబం పలు మార్లు టమోటా పంట నష్టాలు రుచి చూసిన పట్టు విడవకుండా తిరిగి అదే పంటను ఎన్నుకున్నారు.. ఏప్రిల్ లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

జూన్ చివరిలో దిగుబడి మొదలైంది. దిగుబడిని జిల్లాకు దగ్గరగా ఉండే కర్ణాటకలోని కోలార్ మార్కెట్ విక్రయించారు.. వేలం పాటలో 15 కిలోల పెట్టె ధర రూ. వెయ్యి నుంచి రూ. 1500 మధ్య పలికింది.. ఇప్పటి వరకు 40వేల పెట్టెలు విక్రయించగా రూ.4 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు. అందులో ఎకరాకు రూ.3 లక్షల చొప్పున పెట్టుబడి 22 ఎకరాలకు రూ.70 లక్షలు, కమీషన్ రూ.20 లక్షలు, రవాణా ఖర్చులు రూ. 10 లక్షలు పోనూ రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు..

 దేశంలో అతిపెద్ద టమోటా మార్కెట్ లో ఒక్కటైనా మదనపల్లె ‌టమోటా మర్కెట్ యార్డ్ నుండి వివిధ రాష్ట్రాలకు ప్రతి నిత్యం టమోటా ఎగుమతి జరుగుతుంటుంది.. ఒక్కసారిగా టమోటా ధర అధికంగా కావడంతో టమోటా రైతులు సంతోషానికి హద్దులు లేవు..మదనపల్లె మార్కెట్ యార్డ్ లో కిలో టమోటా 165 రూపాయలుగా పలికింది. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన బి మహిపాల్ రెడ్డి అనే రైతు గత 15 రోజులుగా టమోటాలు అమ్మి రూ.2 కోట్లు సంపాదించాడు. 25 నుంచి 28 కిలోల డబ్బాల్లో పంటను విక్రయిస్తే ఒక్కో బాక్సుకు రూ.2,500 నుంచి రూ.2,700 వరకు ధర పలికింది. 7,000 డబ్బాలు అమ్ముడవడంతో, అతని సంపాదన 2 కోట్ల రూపాయలకు చేరుకుంది.మరో నెల రోజుల వరకూ టమోటా ధర ఇలానే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.