
కొండాపూర్, వెలుగు: సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 55 మంది కార్మికులు మృత్యువాత పడి15 రోజులైనా కంపెనీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ ప్రశ్నించారు. మంగళవారం జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్అధ్యక్షతన సంగారెడ్డి కలెక్టరేట్ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. సిగాచి ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి, గాయపడ్డ క్షతగాత్రులకు రూ.50 లక్షలు ఇవ్వాలని, సిగాచి యాజమాన్యాన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రమాదానికి కారణమైన ఇన్స్పెక్టర్ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సురేశ్, సందీప్, కార్మికులు పాల్గొన్నారు.
మెదక్ టౌన్ : సిగాచి ప్రమాదంలో మరణించిన బాధితులకు యాజమాన్యం రూ.కోటి, ప్రభుత్వం రూ. 50 లక్షలు ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గౌరి, సంతోష్, నాయకులు నరేందర్, సత్యం, అజయ్ పాల్గొన్నారు.