- మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలని మెదక్ జిల్లా నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం ఆమె కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన రాహుల్ రాజ్ బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమాసింగ్కు జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అలాగే ఇంటర్, పదో తరగతి పరీక్షల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన కలెక్టర్గా వచ్చిన ప్రతిమాసింగ్కు జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.
