మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో పోలీసు శాఖకు సంబంధించి రెండు పెట్రోల్ బంకులు మంజూరయ్యాయని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేటలో ఇండియన్ ఆయిల్ బంక్లు మంజూరయ్యాయి. మెదక్ లోని రూరల్ పోలీస్స్టేషన్ పక్కన, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఈ పంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నశంకరంపేట పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉండగా... గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్బంకుకు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, రంగనాథ్, సీఐలు జార్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఆర్ఐ శైలందర్, రామకృష్ణ, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
