మంత్రులు వివేక్, దామోదర్ ను  కలిసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

మంత్రులు వివేక్, దామోదర్ ను  కలిసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్, కౌన్సిలర్ లు గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మెన్ పదవి కైవసం చేసుకోవడంలో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్  నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డిని మంత్రులు అభినందించారు. నర్సాపూర్ పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని వారు తెలిపారు.

మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ  త్వరలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసి, ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు కృషిచేస్తామని,  ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.45 కోట్లతో మున్సిపాల్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, కౌన్సిలర్లు సుధీర్, సరళ ఆంజనేయులు గౌడ్, నరసమ్మ, పాల్గొన్నారు.