కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ దారి తీసింది. 2024, మార్చి 9వ తేదీ శనివారం జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
 
చెక్కుల పంపిణీ సందర్భంగా ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ.. పేదింటి అడ పిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని.. అర్హులైనవారు ధరఖాస్తు చేసుకోవాలని అన్నారు. విధి విధానాలు తెలుపకుండా ఎలా ధరఖాస్తు చేసుకోవాలని.. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫొటో ఎందుకు లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు వాదించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ లు రెండు వర్గాల వారిని సముదాయించారు.