పోలింగ్ సమీపంలో అభ్యర్థి వద్ద నోట్ల కట్ట..సీజ్ చేసిన అధికారులు

పోలింగ్ సమీపంలో  అభ్యర్థి వద్ద నోట్ల కట్ట..సీజ్ చేసిన అధికారులు

 


జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాసపల్లి వంశీ వద్ద పోలీసులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఆయన డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆయనను తనిఖీ చేయగా జేబులో రూ.28,500 దొరికాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై వంశీ స్పందిస్తూ.. తాను ఎవరికీ డబ్బులు పంచలేదని, ఇతరులకు ఇవ్వాల్సి ఉండగా దగ్గర పెట్టుకున్నానని చెప్పారు. ఇంతలోనే పోలీసులు సోదా చేసి పట్టుకున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రానికి సమీపంలో డబ్బులు కలిగి ఉండొద్దని, అందుకే వాటిని సీజ్ చేశామని అధికారులు తెలిపారు.